ఇకనుండి 2000 నోటు చెల్లని కాగితం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల మార్పిడిడిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీకి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. అది నిన్నటితో ముగీసింది. గడవును పొడిగించేది లేదని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఆదివారం నుంచి 2 వేల నోటు ఒక చరిత్రగా మిగిలిపోనుంది. అందువల్ల ఇప్పటికీ పెద్ద నోటను మార్పిడీ చేసుకోనివారు ఈరోజు సాయంత్రంలోగా ఎక్ఛేంజ్‌ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణీలో ఉన్నాయి. వాటిలో సెప్టెంబర్‌ 1 నాటికి 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. అంటే వీటి విలువ రూ.3.32లక్షల కోట్లు. మరో 7 శాతం అంటే రూ.24 వేల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకు శాఖలుఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. అదేవిధంగా డిపాజిట్‌ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి రూ.20 వేల వరకు ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. కాగారూ.2 వేల నోటును ఆర్బీఐ 2016 నవంబర్‌లో ప్రవేశపెట్టింది. అయితే 2018-2019లోనే ఈ నోట్ల ముద్రణను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.