మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్; ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసు టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటాడుతుంటే… అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసు చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని వెంటాడుతోంది. ఈ కేసులో ఆయనను ప్రశ్నించేందుకు 41A కింద నోటీసులు ఇవ్వొ్చ్చని ఏపీ హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. లోకేష్ తరపున సీనియర్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా… సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేష్‌ 14వ నిందితుడిగా ఉన్నారనీ, ఆయన్ని ప్రశ్నించేందుకు 41A కింద నోటీసులు ఇస్తామని శ్రీరామ్ తెలిపారు.ఈ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. లోకేష్.. విచారణకు సహకరించాలని ఆదేశించింది.ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈ కేసులో A14 నిందితుడిగా ఉండటంతో… ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చారు CID దర్యాప్తు అధికారులు.అమరావతి ఇన్నర్ రింగు రోడ్డులో మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్‌కి ప్రతిఫలం కలిగేలా… ఎలైన్‌మెంట్ మార్పులు చేశారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎలైన్‌మెంట్ మార్పులతో ఉత్తరాన ఉన్న నారాయణ ఆస్తులు దెబ్బతినకుండా చేశారనీ, అలాగే… దక్షిణాన లోకేష్ హెరిటేజ్ సంస్థ ఆస్తుల విలువ పెరిగేలా మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఏపీ హైకోర్టులో మరి కాసేట్లో విచారణకు రానుంది. మరోవైపు మరికాసేట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారించనుంది

Leave A Reply

Your email address will not be published.