సదాశివ్ పేట్ తహసిల్దార్ కార్యాలయం పై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలంలో గాంధీ జయంతి ఉత్సవాలు స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గాంధీకి పూలమాలలు వీసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ తో పాటు స్వరాజ్యం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులకు సముచిత గౌరవం లబించడం లేదని ఆవీదన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం , సదాశివపేట మండల తాసిల్దార్ కార్యాలయం వారు పూల మాలలు, శాలువాలతో సన్మానాలకు పరిమితం చేశారు కానీ స్వతంత్ర సమరయోధులు కన్న కలలను నెరవేర్చడం కోసం స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్లే దశ దిశలో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ సిద్దాపూర్ గ్రామం సర్వేనెంబర్ 267 లో పది ఎకరాలు కేటాయించిన భూమిలో అభివృద్ధి పతంలో కార్యక్రమాలు చేపట్టడం కోసం తెలంగాణ గవర్నర్ డిజిపి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ, సదాశివపేట సిఐ అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ప్రజావాణికి విజ్ఞప్తి పత్రం అందజేసి పనులు ప్రారంభిస్తుంటే మూర్ఖత్వంతో స్వాతంత్ర సమరయోధుడు విలువలు తెలవకుండా సదాశివపేట తహసిల్దార్ కార్యాలయం దేశద్రోహులుగా వ్యవహరిస్తూ పనులను ఆగస్టు 16వ తేదీన అడ్డుకొని అధికారికంగా ధరణిలో చేర్చిన తర్వాత పనులు ప్రారంభించాలని మభ్యపెడుతూ మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు..ఇట్టి విషయంలో మంత్రి హరీష్ రావు చెప్పిన, సంగారెడ్డి జిల్లా ప్రజావాణి సిబ్బంది సదాశివపేట తాసిల్దార్ చెప్పిన మూర్ఖత్వంతో దేశ ద్రోహులుగానే వ్యవహరిస్తున్నారని తెలియజేస్తూ ఇలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పై అడికాల్రులకు విజ్ఞప్తి చేసారు.ఈ యొక్క గాంధీ జయంతి వేడుకల్లో స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంఘం అధ్యక్షులు మునిపల్లి రమేష్, కార్యదర్శి కూచిని సతీష్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అధ్యక్షులు దొడ్ల వెంకట్ మరియు సదాశివపేట పట్టణ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.