భూమి వైపుగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం..!

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: లక్ష్యం లేకుండా విశాలమైన భారీ గ్రహశకలం తిరుగుతున్నది. దీనికి స్థిరమైన మార్గం, గమ్యం లేదని.. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ‘కాస్మిక్ నోమాడ్’ పలుసార్లు ఇతర అంతరిక్ష వస్తువులు, గ్రహాలకు సమీపంగా వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆస్టరాయిడ్‌లపై నిఘా ఉంచేందుకు ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. తద్వారా మన గ్రహం విపత్తు నుంచి సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. నాసా భూమికి అతి సమీపంలోకి వెళ్లే గ్రహశకలాలను జాబితా చేస్తూ ప్రత్యేక పేజీని సైతం రూపొందించి.ఆ జాబితాలో ఆస్టరాయిడ్‌ 2023 SN6 భూమివైపుగా వస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. విమానం పరిమాణం ఉన్న ఖగోళ రాయి ఈ నెల 4న 4.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో భూమిని దూటుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహశకలం గంటకు 30,564 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నాటా డేటా పేర్కొంది. అయితే, ఈ గ్రహశకలం కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ స్టడీస్‌ పేర్కొంది. ఆస్టరాయిడ్‌ భూమికి సమీపంలో ఉన్న అపోలో గ్రహశకలాలకు చెందింది. 1862 అపోలో గ్రహశకలాల సమూహాన్ని జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ రీన్‌ముత్‌ 1930లో కనుగొన్నారు.సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి గ్రహశకలాలు తిరుగుతుంటాయి. అవి ఆవిర్భవించిన చోటు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్తుంటాయి. అయితే, 2022లో నాసా భూమివైపునకు దూసుకువస్తున్న గ్రహశకలాలను గుర్తించి, మళ్లించేందుకు మిషన్‌ను ప్రారంభించింది. దీన్ని డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌) మిషన్‌గా పేరు పెట్టింది. తొలి దశలో శాస్త్రవేత్తలు పంపిన స్పేస్‌క్రాఫ్ట్‌ సెప్టెంబర్‌ 26న టార్గెట్‌ గ్రహశకలమైన డైమోర్ఫోస్‌ను ఢీకొట్టింది. క్యూబ్ ఆకారంలో ఉన్న ‘ఇంపాక్టర్’ వాహనం.. దాదాపుగా వెండింగ్ మెషీన్ పరిమాణంలో ఉంటుంది. భూమి నుంచి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఫుట్‌బాల్ స్టేడియం పరిమాణ ఉల్కలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.

Leave A Reply

Your email address will not be published.