ఈవీఎం మిషన్లకు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేయాలి-

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఈవీఎం మిషన్లకు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ విజ్ఞప్తి చేసారు. విద్యానగర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజలు కోరుకునే పాలననే రావాలి అదేవిధంగా ఈవీఎం మిషన్ల పాత్ర చాలా కీలకమైందని ఒక ప్రకటనలో తెలియజేశారు. తదనంతరం సమావేశంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించడంలో ఈవీఎం మెషిన్ల యొక్క పనితీరు చాలా కీలకమైంది అని తెలియజేస్తూ ఎప్పుడైతే ఈవీఎం మిషన్లకు ఆధార్ కార్డు లింక్ మరియు బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేసి ఉపయోగించబడతాయో అప్పుడే ప్రజలు కోరుకునే నాయకుడు, ప్రజల్లో నుండి పుట్టుకు వచ్చే నాయకుడు వస్తాడని, ఓటర్ మహాశయులకు,ప్రజా ప్రతినిధులకు,అన్ని రాజకీయపార్టీల అధినేతలకు, సంఘసంస్కర్తలకు విజ్ఞప్తి చేసారు. జరగబోయే ఎన్నికలు ఈవీఎం మిషన్లకు ఆధార్ కార్డు లింక్ మరియు బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించే విధంగా బాధ్యతగా పట్టించుకోని చూడవలసిన బాధ్యత మనందరిదని అన్నారు. అదేవిధంగా భారత ఎన్నికల కమిషనర్కు మరియు తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు ఇట్టి విషయంలో చిత్తశుద్ధి పెట్టి ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల్లో నుండి పుట్టుకొచ్చే నాయకులతో ఏర్పడే ప్రభుత్వాలు ఏర్పడే విధంగా ఈవీఎం మిషిన్లకు ఆధార్ కార్డ్ లింక్ మరియు బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తుంది . ఇట్టి విషయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలుపెరగని పోరాటం చేయడంలో ఎప్పుడు ముందుంటుందని సత్యనారాయణ గౌడ్ తిలిపారు. ప్రజలు కోరుకునే పరిపాలన రావడం కోసం రేపు హైకోర్టులో పిల్ వేస్తామని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీలం వెంకటేష్,ఉదయ్ కుమార్ నేత, రాజేందర్, పృథ్వీరాజ్, భూపేష్ సాగర్, నందగోపాల్, ఉదయ్ కుమార్ నేత మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.