అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కుల గణన కీలకం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా మద్దతిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని ప్రకటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన వాదనను మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. ఓబీసీలుదళితులుగిరిజన కమ్యూనిటీల నిజమైన సామాజికఆర్థిక పరిస్థితిలకు వెల్లడించే ఎక్స్‌రేగా కులగణనను ఆయన అభివర్ణించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతివారి సమస్యల పరిష్కారానికి కులాల గణన కీలమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో షహడోల్‌లో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూఓబీసీలుఎస్‌సీ వర్గాలకు ఇస్తున్న వాటా ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే ప్రశ్న దేశం ముందు ఉందని చెప్పారు. ఆ కారణంగానే కులగణను తాము పిలుపునిచ్చామనిఆ పని చేసి తీరుతామని చెప్పారు.కులగణన అంశంపై బీజేపీ తన ప్రసంగాల్లో చేస్తున్న వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొట్టారు. సొంత పార్టీలోనే ఆదివాసీలకు (స్వదేశీ గిరిజన వర్గాలు) బీజేపీ ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ లేబొరేటరీలో వారి నేతలు ఆదివాసీలపై మూత్రవిసర్జన చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ లేబరేటరీ నిర్మిస్తామని అడ్వానీ చెప్పిన దానికి అర్ధం ఇదే” అని విమర్శించారు. అడ్వానీ ఒక పుస్తకం రాశారనిఆర్ఎస్ఎస్-బీజేపీ నిజమైన లేబొరేటరీ గుజరాత్ కాదనిమధ్యప్రదేశ్ అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారని రాహుల్ చెప్పారు. బీజేపీ లేబొరేటరీలో మృతులకు చికిత్స అందజేస్తున్నారనివారి సొమ్ములు దోచుకుంటున్నారనిఒక్క మధ్యప్రదేశ్‌లో మినహా ఇలాంటిది ఎక్కడా జరగదని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు

Leave A Reply

Your email address will not be published.