ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ అరెస్ట్ అయ్యాడు. కాసేపటి క్రితమే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పిఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ అనే వ్యక్తి… గుర్తు తెలియని వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. పెద్ద కర్ర పట్టుకుని దారుణంగా కొట్టాడు భాస్కర్.

ఆ గుర్తు తెలియని వ్యక్తిని విచక్షణ రహితంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అకారణంగా ఓ వ్యక్తిని చితకబాదుకు కనిపిస్తున్న ఈ వీడియోలో బాధిత వ్యక్తి…

కాళ్లు మొక్కుతున్నావ్ భాస్కర్ వినిపించుకోలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో… కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.