తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బతుకమ్మ పండుగ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రపంచ దేశాల వరకు బతకమోత్సవాలు.  ప్రత్యేక రాష్ట్రo  సిద్ధించాక అధికారికంగా నిర్వహణ . విశ్వవ్యాప్తంగా గుర్తింపు.  నేటి నుంచి పూల పండగ అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పూదోట లిల్లీ మేరి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అట్టహాసంగా జరుపుకునే బతుకమ్మ పండుగ శనివారం నుంచి మొదలవుతుంది. ఈ తెలంగాణ వాసుల ఇంటింటి పండుగ.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం ఈ పండుగకు రాష్ట్ర హోదా కల్పించారు.  వాస్తవానికి రాష్ట్ర సాధనలో ఈ పండుగ కూడా ఓ కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పూదోట లిల్లీ మేరి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించినప్పుడు ప్రజల్లో సాంస్కృతిక,  సాంప్రదాయ ఆసక్తిని కూడా ఉద్యమాన్నికి అనుకూలంగా మార్చుకున్నామని,  ఉద్యమంలో దీనికి భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రజలందరూ మార్చుకున్నారని ఈ పండుగ పేరిట తెలంగాణలోని ప్రతి ఒక్కరిని ఒకే వేదిక పైకి తెచ్చిందని,  వారిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పట్ల ఆసక్తి రగిలించిందని,  వారిని ఉద్యమం వైపు ప్రేరేపించిందని,  తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ పండుగ సామూహిక నిర్వహణ కూడా ఓ భాగమని,  రాష్ట్ర సాధనలో ఇది ఒక కీలక అంశం అని,  ముందుగా ప్రకటించినట్లే అధికారంలోకి రాగానే బతుకమ్మపండుగకి ప్రభుత్వము రాష్ట్ర హోదాను ఇచ్చిందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పూదోట లిల్లీ మేరి అన్నారు.  ఈ సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ ఈ పండుగకు జాతీయ,  అంతర్జాతీయ ప్రాధాన్యత ఇప్పుడు లభించిందని,  బతుకమ్మ పండుగ రోజుల్లో తెలంగాణ మొత్తము రంగా వల్లులతో,  గొబ్బెమ్మలు,  పూల అలంకరణతో కళకళలాడి పోతుందని గ్రామాలన్నీ శోభాయ మానం గారు రూపుదిద్దుకుంటున్నాయని సమాజంలోని అన్ని వర్గాలు ఈ పండుగలో భాగస్తులు అవుతున్నారని ఆమె అన్నారు.సమాజంలో సాంస్కృతిక,  సాంప్రదాయ వైభవాలను ఉద్యమాన్ని అనుగుణంగా మార్చుకోవడం,  ఈనాటిది కాదని స్వాతంత్ర ఉద్యమంలో బాలగంగాధర తిలక్ ప్రత్యేక శ్రీకారం చుట్టారని,  తద్వారా తెలంగాణ ప్రజలందరూ ఒకటేనన్న చైతన్యాన్ని  రగిల్చారని వారిలోని అపోహలని,  అనైక్యతను పారద్రోల్లారని,  అనంతరం వారిని తెలంగాణ ఉద్యమ పోరాటం వైపు కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దారని లిల్లీ మేరి అన్నారు.9 సంవత్సరముల క్రితం వరకు బతుకమ్మ అంటే ఇంటింటి పాట … బతుకమ్మ అంటే  ఊరురా జరిగే ఓ ఉత్సవం.  కానీ ఇప్పుడు ఈ పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వ అధికారిక పండుగ.  దేశ విదేశాల్లో దీనికి ఘన కీర్తి లభిస్తుంది.  విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాసులతో పాటు తెలుగు వారంతా కూడా ఇప్పుడే పండుగను ఎంతో ఉత్సవంగా నిర్వహించుకుంటున్నారని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.