మెడికల్ సర్జికల్స్ ప్రమాణాలపై వినియోగదారుల చైతన్య సదస్సులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వినియోగదారులు నిరంతరం వాడకం చేసే వస్తువులు, సేవలపై ప్రమాణాలతో పాటు ప్రాణాధారమైన మెడికల్ సర్జికల్స్ ప్రమాణాలపై వినియోగదారులను చైతన్య పరచడం, “Shared vision for a better world” theme తో రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల ప్రతినిధులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులతో నేడు ఉత్సవాలు ప్రారంభ మైనాయి. దేశంలో అమ్మకం జరుగుతున్న 22,176 వస్తువులకు ప్రమాణాలు నిర్దేశించినట్లు మరియు 606 ప్రమాణాలు తప్పనిసరి చేసినట్లు బి.ఐ.యస్. అధికారులు కె.వి.రావు, టి.రాకేష్, సైంటిస్ట్ విధిష లు తెలిపారు. నేటి కార్యక్రమం లో దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా పల్లెపాడు దామోదర్, సి.సి.ఐ. జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, మహిళా జాతీయ కార్యదర్శి ఎ. శివపార్వతి, క్యాట్కో అధ్యక్షుడు శంకర్ లాల్ చౌరాసియా,  తెలంగాణా వినియోగదారుల సంక్షేమ సంఘం అద్యక్ష, కార్యదర్శులు ఈగ వెంకటేశ్వర్లు, కాసు విశ్వోధర్ రాజు లు, సి.సి.ఐ. సభ్యులు యం. భీం రెడ్డి, శ్రీమతి శిల్పా రెడ్డి, డా. హరిప్రియలు పాల్గొని వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా పలు సూచనలు చేశారు. ఈ నాణ్యతా ప్రమాణాలు ఉత్సవాలు అక్టోబర్ 28 వరకు కొనసాగుతాయి.

Leave A Reply

Your email address will not be published.