విమాన సిబ్బందిని ప్రయాణికులను గందరగోళానికి గురిచేసిన అడల్ట్ డైపర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఫ్లైట్ టాయిలెట్‌లో కనిపించిన అడల్ట్ డైపర్ సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు గందరగోళానికి గురి చేసింది. దాన్ని ఫ్లైట్‌ సిబ్బంది బాంబు గా భావించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో గంట పాటు గాల్లో ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి అత్యవసరంగా కిందకి దించేలాచేసింది. ఈ ఘటన కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లో గత శుక్రవారం చోటు చేసుకుంది.విమానం పనామా సిటీ లోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టంపా మీదుగా ఫ్లోరిడా కు బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన గంట తర్వాత ఫ్లైట్‌ టాయిలెట్‌లో అనారోగ్య సమస్యల కారణంగా పెద్దవాళ్లు వేసుకునే డైపర్‌ను సిబ్బంది గుర్తించారు. అది అనుమానాస్పదంగా ఉండటంతో బాంబుగా భావించి.. పై అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి పనామాకు మళ్లించారు.విమానం పనామా టోకుమెన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాగానే.. బాంబ్‌ స్క్వాడ్‌ గాలింపు చేపట్టింది. ఫ్లైట్‌లో ఉన్న మొత్తం 144 మంది ప్రయాణికుల్ని కిందకు దింపి.. విమానంలో అనువనువునా గాలించింది. టాయిలెట్‌లోని అనుమానాస్పద వస్తువును అడల్ట్‌ డైపర్‌గా గుర్తించింది. విమానంలో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించింది. అనంతరం విమాన ప్రయాణానికి అనుమతించింది. దీంతో ఆ విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.