శుభ్రం చేసే వాటితోనే కాలుష్యం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇంటిని, ఇంట్లోని వస్తువులను కడిగేందుకు, తుడిచేందుకు మనం వాడే రకరకాల క్లీనింగ్ రసాయనాల వల్ల ఇళ్లలో కొత్తరకం సమస్య మొదలవుతుంది. ఎక్కడో బయట కాలుష్యం సంగతి అలా ఉంచితె ఇప్పుడు ప్రమాదకర కాలుష్యం ఇంట్లోనే చాలా ఎక్కువగా పోగవుతుందని, దీనికి మనం వాడే రకరకాల క్లీనింగ్ రసాయనాలే మూలం అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.ఈ సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ గదులను తాజాగా ఉంచుకోవడం కోసం అంటూ మనం వాడే రూమ్ ఫ్రెష్నార్లే కాదు . మనం వాడే షాంపూలు, సబ్బులు, వాషింగ్ పౌడర్లు, సువాసన కోసం వెలిగించే కొవ్వొత్తులు, నేల తుడిచే క్లీనర్లు వంటివన్నీ ఈ రసాయన కాలుష్యాన్ని తెచ్చిపెట్టేవే అని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఉత్పత్తుల్లో అసలు ఏమేo ముడి పదార్థాలను వాడుతున్నారో, వీటి మీద పేరు కొనాల్సిన చట్టపరమైన నిబంధనలేవీ లేవు. విడివిడిగా చూసినప్పుడు వీటిలోని రసాయనాలు సురక్షిత స్థాయిలోనే ఉండవచ్చు కానీ, మనం ఇళ్లలో వీటన్నిటిని కలిపి ఎడాపెడా వాడేసినప్పుడు అన్నీ కలిసి ఏ స్థాయికి చేరుతున్నాయో తెలీదు. అందుకని శుభ్రత తాజాదనాల కోసం సాధ్యమైనంత వరకు వెనిగర్, తినే సోడా (సోడా బై కార్బోనేట్), నిమ్మకాయల వంటి ఏమాత్రం హానిలేని మనం తిన్నా కూడా ఎలాంటి నష్టం చేయని పదార్థాలనే వాడాలని లిల్లీ మేరి సూచిస్తున్నారు. తరచూ దారాళంగా గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా కిటికీలు తీసి ఉంచాలి. కాబట్టి వీలైనంతవరకు పరిశుభ్రత పేరిట రసాయనాల వాడకం తగ్గించడం, వీలుంటే కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.