రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

-   2024-25 సీజన్‌లో ఆరు 1రబీ పంటలకు కనీస మద్దతు ధర ను పెంపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 సీజన్‌లో ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర ను పెంచుతూ నిర్ణయం తీసుకుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తమ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి మద్దతుధరకు పంటలు సేకరిస్తుంటుంది.కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపునకు నిర్ణయించిన ఆరు పంటల్లో గోధుమలు, బార్లీ, శెనగ, కందులు, ఆవాలు, సన్‌ఫ్లవర్ ఉన్నాయి. అత్యధికంగా కందులుపై క్వింటాలు ధరను రూ.425కు పెంచింది. గోధుమల కనీస మద్దతు ధరను రూ.150కి పెంచడంతో క్వింటాల్ గోధుముల ధర రూ.2,275కి చేరింది. బార్లీ ఎంఎస్‌పీని రూ.115కి పెంచడంతో క్వింటా ధర రూ.1,850కి చేరింది. శెనగ ఎంఎస్‌పీని రూ.105కి పెంచడంతో క్వింటా ధర రూ.5,440కి పెరిగింది. కందులు ఎంఎస్‌పీ రూ.425 పెరగడంతో క్వింటా ధర 6,425కు చేరింది. ఆవాలు ఎంఎస్‌పీ రూ.200 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,650కి చేరింది. సన్‌ఫ్లవర్ ఎంఎస్‌పీ రూ.150 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,800కి చేరింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా ముందు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.