టీవీ-డీ1 ఫ్ల‌యిట్ టెస్ట్ విజ‌య‌వంటం.. చరిత్ర  సృష్టించిన ఇస్రో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇస్రో మ‌నుషుల‌ను నింగిలోకి పంపే ప్ర‌యోగంలో స‌క్సెస్ సాధించి చరిత్ర  సృష్టించింది.. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన టీవీ-డీ1 ఫ్ల‌యిట్ టెస్ట్ విజ‌య‌వంత‌మైంది. తొలుత రెండు సార్లు ఈ రాకెట్ ప్ర‌యోగాన్ని వాయిదా వేసినా.. ఆ త‌ర్వాత ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్న‌ట్లే నింగిలోకి దూసుకెళ్లి.. ఆ త‌ర్వాత బంగాళాఖాతంలో సుర‌క్షితంగా దిగింది. పారాచూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్‌ను సేక‌రించ‌నున్న‌ది.ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు వెద‌ర్ స‌రిగా లేని కార‌ణంగా ప్ర‌యోగాన్ని 8.45 నిమిషాల‌కు వాయిదా వేశారు. అయితే 8.45 నిమిషాల‌కు చేప‌ట్టిన‌ టీవీ-డీ1 ప్ర‌యోగంలో ఉద‌యం సాంకేతిక లోపం త‌లెత్తింది. రాకెట్ ఇంజిన్‌లో ఇగ్నిష‌న్ లోపం వ‌చ్చిన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. ఇంజిన్ మండ‌క‌పోవ‌డం వ‌ల్ల అనుకున్న స‌మ‌యానికి గ‌గ‌న్‌యాన్ మాడ్యూల్ ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. 5 సెక‌న్ల ముందు ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. అయితే ఆ ప‌రీక్ష‌ను ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్వ‌హించారు.ప్ర‌తిష్టాత్మ‌క గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు మ‌రింత ఉత్తేజం వ‌చ్చింది. టీవీ-డీ1 ఫ్ల‌యిట్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల ఇస్రో చైర్మెన్ సోమ‌నాథ్ సంతోషం వ్య‌క్తం చేశారు. సాంకేతిక లోపాన్ని త్వ‌ర‌గా ప‌సిక‌ట్ట‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌ళ్లీ ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.