బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పగడాల సుధాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిసి సంక్షేమ సంఘం బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా పగడాల సుధాకర్ ముదిరాజ్  నియమితులైనారు. ఈ మేరకు  రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ  దశాబ్దాలు తరబడి అని అన్యాయంకు గురవుతున్న బిసిలు ఐక్యతతోనే రాజ్యాధికారాన్ని సాధించగలుగుతారని అన్నారు.దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బిసిలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే న్యాయం చేసినట్లునని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలకు పైగా గడిచిందని, ఇప్పటికైన పాలకులు, అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.. ప్రతి బిసి చట్ట సభలలో బిసిలకు రిజర్వేషన్లు సాధించేందుకు కంకణ బద్ధులై పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి సంక్షేమం రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా బిసి లఅభి వృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన సుధాకర్ సేవలను గుర్తించి ఆయనను బిసి సంక్షేమ సంఘం బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమించారు.  అనంతరం పగడాల సుధాకర్ ముదిరాజ్  మాట్లాడుతూ భవిష్యత్తులో బిసిలకు అభివృద్ధికోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఆర్.కృష్ణయ్య చేసే పోరాటాలకు ముందుండి మరింతగా సహకార్ని పూర్తి స్థాయిలో అందించగలనన్నారు. తనపైన నమ్మకం ఉంచి బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా నియ మించిన ఆర్.కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర స్థాయిలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటి కప్పుడు తెలుసుని ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఉద్య మించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారా యణ, నీల వెంకటేష్, సి. రాజేందర్, వేముల రామకృష్ణ, రాజ్కుమార్, నందగోపాల్, శివా, జిల్లపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.