30 న ఆదోని నుండి సిపిఎం బస్సు యాత్ర ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసమానతలు లేని అభివృద్ధి కోసం 30న ఆదోని నుండి చేప‌ట్టే సిపిఎం ప్రజా రక్షణ బేరి రాష్ట్ర బస్సుజాతను జయప్రదం చేయాలని సిపిఎం కర్నూల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాధాకృష్ణ, సీనియర్ నాయకులు ఈరన్న, మహానందరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కర్నూల్ జిల్లా ఆదోనిలోని కల్లుబావిలో ఆటో ప్రచారజాతను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన పాలక పార్టీలు ప్రజలను మోసం చేశాయని వారు తెలిపారు. కర్నూలు జిల్లా నుండి అతిరథ మహారథులు రాజకీయంగా అత్యున్నత పదవులు పొందిన జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని వారు అన్నారు. కర్నూలు జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ కూడా లేదని వారు తెలిపారు. కర్నూలు జిల్లా సాగునీరు, పారిశ్రామిక రంగం, విద్యలో, వెనుకబాటు తనంతో ఉందని వారు తెలిపారు. గత 75 సంవత్సరాలుగా దేశాన్ని రాష్ట్రాన్ని, పాలిస్తున్న పాలకులకు జిల్లా అభివృద్ధి పట్టడం లేదని వారు తెలిపారు. అనునిత్యం పాలక పార్టీలు ప్రజలను తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప చేసింది ఏమి లేదని వారన్నారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, యువతకు ఉపాధి, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో 30న రాష్ట్ర బస్సు జాత ఆదోనిలో ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, ముక్కన్న, తిప్పన్న, పట్టణ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, నాగేంద్ర, నాగరాజు, వెంకటేష్,, అజీమ్ ఖాన్, నాయకులు రాజు, ఈరన్న, మల్లయ్య, తిమ్మయ్య పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.