ఉచిత వైద్య శిబిరాలు నిరుపేదలకు వరం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఆరోగ్యం సరిగా లేకుంటే ఎంత సంపద ఉన్నా వృధా,  ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల నానుడి అక్షర సత్యమని మనిషి జీవితంలో ఎంత సిరిసంపద ఉన్నా ఆరోగ్యవంతమైన జీవితం లేకుంటే ప్రయోజనం లేదని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ  సాయి చౌదరి అన్నారు. నేడు కూకట్పల్లిలోని అంబేద్కర్ నగర్ కాలనీ యందు ఉచిత వైద్య శిబిరాన్ని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల ప్రభావం వలన వ్యాధి కారకాలు పెరిగిపోతున్నాయని,  దానికి ప్రధాన కారణం ప్రజలు స్వయం కృతాపరాధం వల్లనే జరుగుతుందన్నారు.  ఈ పరిస్థితుల నుండి ప్రజలు బయటపడాలంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలంటే వైద్యుల సూచనలు, సలహాలను పాటించాలని స్థానికంగా లభించే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని,  శారీరక శ్రమలు చేయాలని,  ఒత్తిడిలను జయించేలా కృషి చేయాలని సాయి చౌదరి సూచించారు.  ప్రతి ఏడాదికి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు.  స్థూలకాయము,  సమతుల ఆహారము తీసుకోకపోవడం,  మానసిక ఒత్తిడి ప్రభావం వలన వ్యాధులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని సా యిచౌదరి అన్నారు.  ముందు జాగ్రత్తగా శారీరక శ్రమ చేయాలని,  మానసిక  ఒత్తిడిలను జయించడానికి యోగా,  మెడిటేషన్ చేయాలని,  ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలని,  సమతుల్ ఆహారాన్ని తీసుకోవాలని సాయి చౌదరి సూచించారు.  అప్రమత్తతో అనారోగ్యానికి స్వస్తి పలకాలని , ఆరోగ్య సంరక్షణ పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని,  వాతావరణ కాలుష్యంతో రోగాల వ్యాప్తి పెరుగుతుందని సాయి చౌదరి తెలిపారు.  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ  సాయి చౌదరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.