వైట్ హౌస్ ముందు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశం ఏర్పాటు

   అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు వీరాంజనేయులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వాషింగ్టన్ డిసి లోని అగ్ర రాజ్యాధినేత జో బై డన్  అధికారిక నివాసమైన వైట్ హౌస్ ను, ది అమెరికా క్యాపిటల్ సెనేట్ కార్యాలయాన్ని, ప్రపంచంలోనే అతి పెద్దదైన యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ను అఖిల భారత పంచాయతీ పరిషత్( న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ జాస్తి వీరాంజనేయులు బృందం సందర్శించింది.ఈ సందర్భంగా వీరాంజనేయులు ఆయన మాట్లాడుతూ అమెరికా పరిపాలన భవనమైన ది క్యాపిటల్ సెనేట్ అది ఒక గొప్ప ప్రజాస్వామ్య చట్టాలను చేసే దేవాలయం అక్కడ ఎన్నో అద్భుత కళాఖండాలను ఏర్పాటు చేశారన్నారు. తొలి అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ నుంచి అనేకమంది అమెరికా అధ్యక్షుల విగ్రహాలు అనేకమంది మేధావుల విగ్రహాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక్కడ కట్టడాలు కానీ, యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో 26 మిలియన్ గ్రంధాలు కరపత్రాలతో సహా 90 మిలియన్ అంశాలు దీనిలో ఉన్నాయని తెలిపారు. ఈ గ్రంథాలయ సిబ్బంది 3,597 మంది. గ్రంథాలయ డైరెక్టర్ జేంస్ బిల్లింగ్టన్. లైబ్రరీ లో అద్భుతమైన పెయింటింగ్స్ కానీ ఎన్నో గ్రంథాలు ఇక్కడ ఉండటం విశేషం ఇక్కడ తీర్చిదిద్దిన కళా కృతులు ప్రపంచంలోనే ఒక అద్భుతం అని అన్నారు ఇక్కడ వైట్ హౌస్  అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం  ముందు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా  మాట్లాడే హక్కును, నిరసన తెలిపే హక్కును ఇక్కడ ప్రభుత్వం   ప్రపంచంలో ఉన్న ఏ దేశ పౌరుడైనా ఇక్కడ నిరసన తెలిపే హక్కును కూడా ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ  గొల్లపూడి నాగ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.