డేవిడ్ వార్నర్ కి బిగ్ షాక్..క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : అనుకున్నదే జరిగింది. వన్డే కెప్టెన్సీ (ODI Captaincy) విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న వేళ.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. వన్డే కెప్టెన్సీ విషయంలో తర్జనభర్జన పడుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఆరోన్ ఫించ్ వారసుడిని ఎంపిక చేసింది. వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్‌గా రాణించడంతో వన్డే జట్టుకుసైతం నాయకత్వం వహించే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ఇటీవల వరకు వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వ్యవహరించాడు. అతను వన్డేల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో T20 జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.  వైస్ కెప్టెన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. స్టీవెన్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా అపాయింట్ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నూతన శకానికి నాంది పలికినట్టయింది. జాతీయ జట్టు కెప్టెన్ గా ఓ ఫాస్ట్ బౌలర్‌ను నియమించడం ఇదే తొలిసారి. పాట్ కమిన్స్ అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 17 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడు. వచ్చే ఏడాది భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గానూ పాట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమిన్స్ తోపాటు పలువురి పేర్లను పరిశీలించింది. వీరిలో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. కెప్టెన్‌గా వార్నర్‌పై విధించిన నిషేధ సమయం పూర్తి కావడంతో ఇక అతని చేతికే పగ్గాలు అందుతాయని అంచనా భావించారు. అయితే, ఫలితం మరోలా వెలువడింది. డేవిడ్ వార్నర్ పేరును పరిగణనలోకి కూడా తీసుకోలేదు. అలాగే- ఫామ్ కోల్పోయి సతమతమౌతోన్న స్టీవెన్ స్మిత్ పేరును కూడా పరిశీలించలేదు.

Leave A Reply

Your email address will not be published.