ఉప్పల్ జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.  శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉప్పల్ లోని హనుమాన్ నగర్ లో ఇంట్లో ఉన్న నర్సింహశర్మ, శ్రీనివాస్ పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి వచ్చిన దుండగులు మొదట శ్రీనివాస్  తండ్రి నర్సింహశర్మపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో దుండగులను తన తండ్రిపై దాడి చేస్తుండగా శ్రీనివాస్ అడ్డుకోబోయాడు. దీనితో దుండగులు శ్రీనివాస్ పై కూడా దాడి చేసి తండ్రీ కొడుకులను హత మార్చారు.  తండ్రీకొడుకుల మర్డర్ తో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ఈ డబుల్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ హత్యలకు ఆస్తివివాదాలు, భూతగాదాలే కారణం అనుకుంటే పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. క్షుద్రపూజల కోణంలో పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఘటనా స్థలంలో ఉన్న బ్యాగులో కుంకుమ, పసుపు ప్యాకెట్లు లభ్యం అవ్వడం ఇప్పుడు మరిన్ని విషయాలను బయటకుతీసుకొచ్చింది. అయితే హత్య జరిగిన అనంతరం పెద్ద ఎత్తున మహిళలు, యువకులు నర్సింహశర్మ   ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ఈ విషయంపై ఆరా తీసిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. నర్సింహా శర్మ పురోహితుడు, అంతేకాదు క్షుద్రపూజలు చేస్తాడని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే క్షుద్రపూజల నేపథ్యంలో నర్సింహశర్మకు   వినాయక రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పూజలతో ఆరోగ్యం, ఆర్ధికంగా నష్టం వాటిల్లింది. దీనితో వినాయకరెడ్డి ఎలాగైనా పురోహితుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి నర్సింహశర్మ ఇంటి దగ్గరలోని హాస్టల్ లోకి దిగారు. నరసింహశర్మ  కదలికలను గమనించిన వినాయక, బాలకృష్ణ 7 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. పథకంలో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నర్సింహశర్మ  ఇంట్లోకి ప్రవేశించారు. అయితే వారు కేవలం నర్సింహశర్మను చంపడానికి రాగ శ్రీనివాస్ అడ్డు రావడంతో ఇద్దర్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా క్షణాల్లో నిందితులు ఇద్దరిపై కత్తిపోట్ల వర్షం కురిపించారు. శ్రీనివాస్ మృతదేహంపై ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది.

Leave A Reply

Your email address will not be published.