సర్కారు బడుల్లో ఆంగ్లమధ్యమం ప్రవేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని, ఇంగ్లిష్‌లోనే బోధించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. అవసరాన్ని బట్టి తెలుగు, ఉర్దూలను కూడా వినియోగించాలని తెలిపింది. గత విద్యాసంవత్సరంలో 1 -8 తరగతులు, ఈ ఏడాది 9వ తరగతిలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌ మీడియం చదువుల అమలుపై పాఠశాల విద్యాశాఖ సమీక్షించింది. ఇంగ్లిష్‌ మీడియం బోధనలో అనేక సవాళ్లు ఎదురవుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది.ముఖ్యంగా తెలుగు, ఉర్దూ మీడియం టీచర్లనే నియమించడంతో భాషేతర సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో బోధించడం కష్టమవుతుందని, తరగతి గదిలో బోధన తెలుగు, ఉర్దూలోనే కొనసాగుతున్నదని గుర్తించింది. ఇక విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారని, ఇంగ్లిష్‌లో రాయలేకపోతున్నారని తేల్చింది. ఈ సమస్యలను అధిగమించేందుకు నిపుణులతో చర్చించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆయా మార్గదర్శకాలను పాటించాలని డీఈవోలకు సూచించింది. విద్యార్థుల పదజాలాన్ని, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు, బహుభాషా, అనువాద పద్ధతులను అవలంబించాలని ఆదేశించింది.

మార్గదర్శకాలు….

  • 7వ తరగతి వరకు కృత్యాలు, సూచనలు, ప్రయోగాలకు, ఆటలను తెలుగు, ఉర్దూలో నిర్వహించినా.. ఇదంతా 8, 9 తరగతుల్లో పూర్తిగా ఇంగ్లిష్‌లోనే జరగాలి. ఈ విద్యార్థులు టెన్త్‌వచ్చేసరికి ఇంగ్లిష్‌వాడాలి.
  • ఇంగ్లిష్‌ నైపుణ్యాల వృద్ధికి టీచర్లు దీక్షా పోర్టల్‌, ఇతర వెబ్‌సైట్ల వీడియోలను వినియోగించుకోవచ్చు.
  • మౌఖిక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు కాన్సెప్ట్‌ను సహేతుకంగా తెలుసుకొన్నాక, పాఠ్యాంశాలను ఇంగ్లిష్‌లో చదవడం అనుసరించాలి.
  • బోధనలో బహుల భాషలు వాడాలి. ముఖ్యమైన ఇంగ్లిష్‌ పదాలను బోర్డుపై రాయాలి.

ఇంగ్లిష్‌ దినపత్రికలుమ్యాగ్జిన్లు చదవాలి. ఇంగ్లిష్‌ టీవీ చానళ్లను వీక్షించాలి.

Leave A Reply

Your email address will not be published.