ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లుఉంటే.. ఇలా మార్చుకోండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రూ.2 వేలను మార్చుకోవాలని ఆర్బీఐ విధించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అయితే నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐమళ్లీ రెండు ఛాన్స్‌లు కల్పించింది. ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లుఉంటే.. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐకి నగదు పంపుకోవచ్చు. ద్వారా నగదును పంపవచ్చు. తద్వారా అకౌంట్లో సదరు నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. లోకల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో పాటు ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ పద్ధతిలో రూ.2 వేలను మార్చుకునే ఛాన్స్ ఉంది. టీఎల్ఆర్దరఖాస్తు నింపి ఆర్బీఐకి పంపిస్తే.. కస్టమర్ అకౌంట్లో మనీ డిపాజిట్ అవుతుంది. ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్రోహిత్ దాస్ మాట్లాడుతూ.. ఇన్స్యూర్డ్ పోస్ట్ద్వారా నోట్లను పంపితే అమౌంట్ సేఫ్ గా చేరుకుంటుందని.. కస్టమర్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదని, క్యూలో నిలబడే బాధలు అంతకన్నాఉండవని అన్నారు

Leave A Reply

Your email address will not be published.