ఎంఐఎం తొలి జాబితా విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదల నేపథ్యంలో.. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఎంఐఎం పార్టీ ప్రకటించింది. అయితే.. ఈసారి ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ.. ఈసారి మాత్రం అదనంగా మరో రెండు కొత్త స్థానాల్లో నుంచి కూడా బరిలో దిగేందుకు పతంగి పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకత్‌పురా, నాంపల్లి, బహదూర్‌పూరా, కార్వాన్, మలక్‌పేట్‌తో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల నుంచి కూడా బరిలోకి దిగుతున్నట్లు పార్టీ పేర్కొంది.ఎంఐఎం పార్టీ తొలి జాబితా..చార్మినార్- జుల్ఫికర్ అహ్మద్చాంద్రయాణ్ గుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీమలక్ పేట – అహ్మద్ బలాలానాంపల్లి- మజీద్ హుస్సేన్కార్వాన్ – కౌసిర్ మోహిద్దీన్యాకత్ పురా – జఫార్ హుస్సేన్ మిరాజ్ఈ 6 స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయనుంది ఎంఐఎం. అయితే.. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. ఈసారి ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ జోరుగా ఉండనుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా ఎంట్రీ ఇవ్వటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే.. తొలి జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి ఈసారి అజారుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.