ప్రపంచ చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన పిట్లం యువతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇటలీ దేశం లోని Riccione(రిచియాన్) లో 28 అక్టోబరు 2023 నుండి 2 నవంబర్ 2023 వరకు జరిగిన 5వ ప్రపంచ చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2023లో  భారత జట్టు క్రీడాకారిణి కామారెడ్డి జిల్లా, పిట్లం మండలకేంద్రానికి చెందిన ప్రతిభ తక్కడపల్లి  అండర్-45 కేజీల బరువు విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

గత సంవత్సరం టర్కీలోని అంటాల్యలో జరిగిన 4వ ప్రపంచ చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2022 లో ప్రతిభ తక్కడపల్లి స్వర్ణం గెలుచుకున్న ఈమె ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆమె మళ్లీ బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో ఆమె కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఆమె వివిధ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లలో 6 బంగారు పతకాలు మరియు 2 రజత పతకాలు కలిపి మొత్తం 8 పతకాలు సాధించింది. ఈ విధంగా ప్రతిభ తక్కడ్ పల్లి నిరంతరం కఠోర శ్రమ తో పతకాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా మరియు భారత దేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నందుకు గాను తల్లితండ్రులు శ్యామల-నర్సింగ్ రావులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.