దేశం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయింది

.. ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్ అన్నారు. మంగళవారం టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించిందని, బీజేపీ లో కేంద్రమంత్రులు సహా పేకుడు రాయుళ్లుగా మారారన్నారు. నిన్న బీజేపీ నేత దగ్గర కోటి రూపాయలు దొరికాయి మునుగోడు లో బీజేపీ ప్రవహింప జేస్తున్న ధనానికి నిదర్శనం అన్నారు. కేవలం డబ్బు పెట్టి ఉపఎన్నికలో గెలవాలని బీజేపీ చూస్తోందని, మునుగోడు ప్రజలు చైతన్య వంతులు. బీజేపీ కి బుద్ది చేబుతారన్నారు. బీజేపీ జోకుడు గాళ్ళు, పెకుడు గాళ్ళు తుపాకీ రాముళ్ల మాటలకు ప్రజలు లొంగరు, మునుగోడు ఉపఎన్నికలో కారు ను పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని మేము ఎన్నో సార్లు ఎన్నికల కమిషన్ కు మొరపెట్టుకున్నామన్నారు. అయినా ..మా మాటను ఈసీ ని పెడ చెవిన పెట్టడం దురదృష్ట కరం, గతం లో తొలగించిన రోడ్ రోలర్ గుర్తును తొలగించారు. ఇపుడు మళ్లీ ఇపుడు ఎవరి ఒత్తిడి తో ఆ గుర్తుని కేటాయించారు,
బీజేపీ వ్యవస్థ లను దుర్వినియోగం చేస్తున్న తీరు కు ఈ సీ తీరు ఓ నిదర్శనం అని వెల్లడించారు. ఇప్పటికైనా ఈ సీ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి మునుగోడు లో హామీలివ్వాలి అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ గా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తేలేదని, మునుగోడు లో ఎదో వెలగబెడతారట కేంద్ర మంత్రులు మిడి మిడి జ్ఞానం తో మాట్లాడుతున్నారు అన్నారు. అసలు బీజేపీ నేతలకు సబ్జెక్టు లేదని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం ప్రతిష్ట ను మంట గలుపుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఏమి మాట్లాడుతున్నారో ఆమెకు అర్థం కావడం లేదని, కర్ణాటక మహారాష్ట్ర లో బీజేపీ ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు తెలుసు, కావాలంటే అక్కడికి ఎవరొచ్చినా తీసుకెళ్తాను. తెలంగాణ అభివృద్ధిని అక్కడి రాష్ట్రాల అభివృద్ధిని పోల్చి చూద్దాం
నేను యూపీ లో 150 కిలోమీటర్లు ప్రయాణించడానికి 6 గంటల టైం పట్టిందాని తెలిపారు. తెలంగాణ లో ఆ పరిస్థితి ఉందా
బీజేపీ నేతలు బేవకూఫ్ మాటలు బంద్ చేస్తే మంచిది అని హితవు పలికారు. మునుగోడు లో గెలవడానికి బీజేపీ డబ్బునే నమ్ముకుంది
బీజేపీ ఈ చిల్లర చేష్టలు ఇప్పటికైనా మానాలి, మోడీ చివరకు నోట్ల రద్దును కూడా అభాసు పాలు చేశారన్నారు. వెయ్యి నోటు రద్దు చేసి 2 వేల నోటు ను తెచ్చారు. డబ్బు రవాణా ను బీజేపీ ప్రభుత్వం సులభ తరం చేసింది, అమెరికా లాంటి దేశం లో నూరు డాలర్ల నోటు యే అత్యంత పెద్దది
భారత్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఈ డబ్బుల రవాణా సులభమయ్యేదా అని ప్రశ్నించారు. బీజేపీ గురించి ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన విమర్శలు ఒక సారి పరిశీలించాలి, బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి, ఎన్నికలపుడు నేతలు పార్టీ లు మారడం సహజం, మా పార్టీ లోకి కూడా నేతలు వస్తారని, .ఎన్నికల కమిషన్ కారును పోలిన గుర్తుల విషయం లో ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి అని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.