ప్రజలు ఆశీర్వదిస్తే వారికోసం పునరంకితం అవుతా

.. బాన్సువాడలో నామినేషన్ దాఖలు చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్/ బాన్సువాడ ప్రతినిధి: బాన్సువాడ పట్టణంలో శనివారం రెండవ రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ బిఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను బాన్సువాడ ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన జీవితం గత సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రజల మధ్య గడిపిన జీవితమని, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ ప్రజల కోసం పునరంకితం అవుతానని ఆయన అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ పది రోజులపాటు కొనసాగుతుందని, టిఆర్ఎస్ పార్టీ తరఫున తాను రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేశానని, నామినేషన్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అందజేసిన బీఫామ్ ఏ ఫామ్ తో పాటు అఫిడవిటి సమర్పించానని అన్నారు. అనంతరం తాను ప్రచార ప్రక్రియలో భాగంగా ప్రచారం కొనసాగించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల ప్రక్రియ లోక్సభకు గానీ శాసనసభకు గానీ జరగాల్సిందే అని ఎన్నికల ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీల వారు తమ తమ రీతిలో కొనసాగిస్తారని శాసన లోక్సభకు ప్రచారం గానీ పనితీరులో గాని పవిత్రమైన పద్ధతి ఉందా తనంతో ఉండాలని ప్రజలు మెచ్చే విధంగా ఉండాలని అన్నారు. శాసనసభ సభ్యుడు ప్రజలు నియోజకవర్గ సమస్యల పట్ల స్పందించాలని, వీలైనంతవరకు వాటిని గురించి పనిచేయాలని, ప్రజల చేత ఎన్నుకున్న వ్యక్తి ప్రజల కోసం పనిచేయాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ఎన్నుకున్న వ్యక్తి ప్రజల కోసం పనిచేయాలని, మేమందరం ఈ పద్ధతికి కట్టుబడి పనిచేశామని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడుకోవాలని రాష్ట్రం నియోజకవర్గ సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం అందించే ఫలాలు అర్హులైన పేదవారికి అందాలని రాజకీయ ప్రక్రియ ఒక మహా సముద్రం అని ఎమ్మెల్యే కాగానే సరిపోదని అనేక బాధ్యతలు బరువులు ఉంటాయని, అందరూ ఉంటావా అన్ని బాధ్యతలు బరువులు మోయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేగా గెలవగానే సరిపోదని అనేక బాధ్యతలు బరువులు ఉంటాయని అన్ని బాధ్యతలు బరువు మోయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేగా గెలవగానే సరిపోదని ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి నిజమైన ప్రజల వ్యక్తి అని అదే దృక్పథంలో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చానని ఈ ఎన్నికలతో తాను ఎనిమిదవ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ఎనిమిదవ సార్ అని ప్రజల ఆశీర్వాదంతో యువకుల సహకారంతో శాసనసభ్యుడుగా ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజల కోసం నియోజకవర్గ కోసం పునరంకితమవుతానని ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయిన రాజకీయ విలువలకు కట్టుబడి విలువలను కాపాడుకోవాలని ఆయన అన్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని అలాగే ప్రజల సంక్షేమం కోసం లోతుగా సర్వేలు చేసి మేనిఫెస్టో పథకాలు చేర్చడం జరిగిందని, నాని ఫస్ట్ పథకాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అమలు చేయడానికి ఆమోదయోగ్యమైనయని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఆపతి కోసం ఆమోదయోగ్యం కానీ హామీలు ఇస్తూ మేనిఫెస్టో పెట్టారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఐదు గంటల కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రస్తుతం మూడు గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారని అలాగే ఎన్నికల తర్వాత బెంగళూరులో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రస్తుతం డీజిల్ లేక బస్సుల్లో ఎక్కి పోటీపడి కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మనిషికి పది కిలోల బియ్యం ఇస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఇప్పటివరకు అమలకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం చూడండి అని చెప్తున్నారని ఐదు గంటలు కాదు కదా మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఇస్తున్నాం చూసుకోమని ఆయనకు పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. కెసిఆర్ నాయకత్వంలో నూటికి నూరుపాళ్ళు ఇంతకుముందు ఏవైతే అమలు చేస్తున్నాము అమలు చేస్తున్న పథకాల్లో కొన్ని ఎలక్షన్ మేనిఫెస్టో లేవని అటువంటి పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ ఎన్నికలు అయిన నెలలో అమలు చేస్తామంటూ, హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ముఖ్యమని, దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పడం కాదు చేసి చూపిస్తున్నాం అన్నారు. ఈ సందర్భంగా తన నామినేషన్ ప్రక్రియకు విచ్చేసిన అందరూ శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.