ప్రజల శ్రేయస్సు ముఖ్యం టిఆర్ఎస్ పార్టీ గెలిపి లక్ష్యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిధి: బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సోమవారం బాన్సువాడ పట్టణం సంగమేశ్వర కాలనీ 6వ & 7వ వార్డ్ లో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన పోచారం భాస్కర్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంగమేశ్వర కాలనీలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను భాస్కర్ రెడ్డి ప్రజలకు,

నియోజకవరగంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, అందుతున్న సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాన్ని మహిళలకు అందిస్తూ,

తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా మార్పు చెందాయో ప్రజలు ఆలోచించలన్నారు.

ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరధ ద్వారా తాగునీరు వస్తుందని, 24 గంటల కరంటు సరఫరా అవుతుందని, గల్లిగల్లికి సిసీ రోడ్లు వేయించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. బాన్సువాడ నియోజకవరగంలోని పిల్లల కోసం హైస్కూల్ లో అదనంగా తరగతి గదులను నిర్మించడం జరిగిందని,

వృద్దులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు వస్తున్నాయని, కేసీఆర్ ప్రకటించిన కొత్త మేనిఫెస్టో ప్రకారం పెన్షన్ 5016 రూపాయలు వస్తాయని,

పోచారం శ్రీనివాసరెడ్డి గత పదేళ్లుగా రైతులను కంటికి రెప్ప లాగ కాపాడుకుంటున్నరని, నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించి, చివరి ఎకరాకు కూడా నీళ్ళు అందేలా చేయడం వల్ల గత పదేళ్ళలో ఏటా రెండు పంటలు పండించుకున్నామని,ఎకరాకు 10,000 రూపాయల రైతుబంధు వస్తుందని, మన కొత్త ప్రభుత్వం వచ్చాక 16,000 లు వస్తాయని, ప్రతి పేదవారికి అయిదు లక్షల రూపాయల కేసీఆర్ బీమా అమలు చేస్తారని,

రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తారని, రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని,

భవిష్యత్తు లో బాన్సువాడ నియోజకవరగం ఇంకా బాగుపడాలంటే అందరూ కారు గుర్తుపై ఓటు వేసి పోచారం శ్రీనివాస రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, పాక్స్ చైర్మన్ కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు జుబెర్, శ్రీమతి సరిత, నాయకులు అనిత, ప్రతిమ రెడ్డి, కిరణ్, యునుస్, శివ, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.