ఆమన్ గల్ జాతీయ రహదారి లో రేషన్ రవాణా లారీని ఆకస్మికంగా తనిఖీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గిడ్డంగి నుంచి చౌక దుకాణాల కు రేషన్ చెర వేసే రవాణా లో పారదర్శకత కు ప్రధమ ప్రాధాన్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు సోమవారం నాడు ఆయన ఆమన్ గల్ జాతీయ రహదారి లో రేషన్ రవాణా లారీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం చేరవేసే లారీలు జీ పి ఎస్ సాంకేతిక తో అనుసంధానం చేయబడి ఉంటాయన్నారు.ఆయా లారీల కదలికల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు.అంతేగాక గుత్తేదారు కూడా అనుమతించిన వాహనాలను మాత్రమే రవాణా కు ఉపయోగించాలన్న నిబంధన ఉందన్నారు.చౌక దుకాణాల కు ప్రజా పంపిణి బియ్యం సకాలం లో చేరేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు

Leave A Reply

Your email address will not be published.