అమెరికాలో కత్తిపోట్లకు గురై ఖమ్మం విద్యార్థి మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) కథ విషాదాంతమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు అక్కడి తెలుగువారు సమాచారం అందించారు. దీంతో వరుణ్‌ రాజ్ ఇంటివద్ద తీవ్ర విషాదం అలుకుంది. ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌ గతేడాది అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.అయితే అక్టోబర్‌ 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా.. గర్తు తెలియని దుండగుడు కత్తితో వరుణ్‌ కణతపై పొడిచి పారిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు డాక్టర్లు సర్జరీ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వరుణ్‌ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కాగా, వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఘటనపై స్పందించిన కేటీఆర్వరుణ్‌రాజ్‌పై జరిగిన దాడి ఘటనపై 5 రోజుల క్రితం కేటీఆర్ స్పందించారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహాకారాన్ని అందిస్తామన్నారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తమ టీమ్ టచ్‌లో ఉంటారన్నారు. కావాల్సిన సహాయం అందిస్తామని చెప్పారు. కానీ అంతలోనే వరుణ్ చనిపోవటం బాధాకరం.

Leave A Reply

Your email address will not be published.