ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంచార్జీ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు 2వ, 3వ వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు.  ఈ సందర్బంగా  డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆర్ ఎస్  కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, పనుల్లో భాగస్వామి అవుతూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ బీజేపీ ని ఈ ఉప ఎన్నికలో ఒడించాలి, మునుగోడు లో గతంలో తెరాస ని ఆదరించక పోయినా కెసిఆర్ ఇక్కడ అన్ని పథకాలను అందించి, అభివృద్ధి చేశారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే, మునుగోడు టీఆరెఎస్ గెలవాలని, బీజేపీ కావాలని ఈ ఎన్నికలు తెచ్చిందని తెలిపారు. వేల కోట్లకు అమ్ముడు పోయిన కొందరి స్వార్దం తో ఈ ఎన్నిక వచ్చిందని, అలాంటి వాళ్లకు, అవకాశ వాడులకు తగిన బుద్ధి చెప్పే, అవకాశం ఇప్పుడు ప్రజలకు వచ్చింది, ప్రజలు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ లో చేరిన వ్యక్తి, ఈ ఏడాదిలో ఏమి చేయగలడు? ప్రజలు ఎవరు ఏమీ చేశారో విశ్లేషించుకోవాలి? ఇంటి పార్టీ, సొంత మనుషులనే ఎన్నుకోవాలి, సీఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి దేశంలోనే ఎవరూ చేయలేదు, రాష్ట్రాన్ని, మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కెసిఆర్ దే అన్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన నాయకులు, మనకు ప్రతినిధులుగా ఉండాలే పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఎంతో అభివృద్ధి చేశారు. మిషన్ భగిరతతో మునుగోడు లో ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘనత ఎవరిదో మీకు తెలుసు. ఇంతకాలం ఏలిన నాయకులకు ఈ సోయి వచ్చిందా? అలాంటి పార్టీలు, నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అందుకే అలాంటి పార్టీలను ఈ ఎన్నికలో బొంద పెట్టాలి టీఆరెఎస్ పార్టీ కి పట్టం కట్టాలి, సారు, కారు తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.