లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ  అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ సతీష్ పాత ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు మహేష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మధ్యవర్తి సాయంతో రూ.9 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో ఉమ్మడి  జామాబాద్ జిల్లాలో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. సతీష్ సీనియర్ అసిస్టెంట్ కాగా సబ్ రిజిస్ట్రార్ గా ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసిన సమయంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అవకతవకల కారణంపై సస్పెన్షన్ కు గురయ్యారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరిన సతీష్ ను బాన్సువాడకు బదిలీ చేసినా అక్కడా తీరు మారకుండా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.