బంక్ ల్లో కనీస సౌకర్యాలు అవశ్యం

- పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్డార్ మాచన రఘునందన్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: పెట్రోల్ బంక్ ల్లో ఇంధన నాణ్యత, పరిమాణం ఖచ్చితత్వం తో పాటుగా తాగే నీళ్లు ,మరుగు దొడ్ల సౌకర్యం కూడా వినియోగదారుల కు విధిగా, పరిశుభ్రం గా అందుబాటు లో ఉంచాలని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.గురువారం నాడు ఆయన కడ్తాల్ లో పెట్రోల్ బంక్ ల ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..పెట్రోల్ బంక్ లను సేవా భావం తో నిర్వహించాలని సూచించారు.కనీస సౌకర్యాలు కల్పించడం భాధ్యత అని చెప్పారు.ఒక వేళ మరుగు దొడ్లు పరిశుభ్రంగా లేక పోతే జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. వినియోగదారుడే ముఖ్య అతిథి ఆన్న సంగతి పెట్రోల్ బంక్ వాళ్లు మరవరాదని గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.