డిసెంబర్ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: 2023.. ముగింపు దశకు చేరింది. మరో 30 రోజుల్లో 2023 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. నేటి నుంచి డిసెంబర్‌ నెల మొదలైంది. ఇక ఏడాది చివరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల) జాబితాను ముందుగానే జారీ చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఆర్‌బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

 

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. డిసెంబర్‌నెలలో బ్యాంకు సెలవుల జాబితా..

 

డిసెంబర్ 1 (శుక్రవారం) – అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.

 

డిసెంబర్ 3 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.

 

డిసెంబర్ 4 (సోమవారం) – సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే – గోవాలో బ్యాంకులకు సెలవు.

 

డిసెంబర్ 9 (రెండో శనివారం) – దేశవ్యాప్త సెలవు.

 

 

డిసెంబర్ 10 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.

 

 

డిసెంబర్ 12 (మంగళవారం) – పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 13, 14 (బుధ, గురువారం) – లోసూంగ్/ నామ్ సూంగ్ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 17 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.

డిసెంబర్ 18 (సోమవారం) – యూ సోసోథామ్ వర్ధంతి – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 19 (మంగళవారం) – గోవా విముక్తి దినోత్సవం – గోవాలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 23 (నాలుగో శనివారం) – దేశవ్యాప్తంగా సెలవు.

డిసెంబర్ 24 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.

డిసెంబర్ 25 (సోమవారం) – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.

డిసెంబర్ 26 (మంగళవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.

డిసెంబర్ 27 (బుధవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 30 (శనివారం) – యూ కియాంగ్ నాంగ్ బాహ్- మేఘాలయలో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 31 (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

Leave A Reply

Your email address will not be published.