ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిబాపూలే భవన్ గా మార్చడం హర్షణీయం  

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిబాపూలే భవన్ గా మార్చుతూ తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బిసి ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ.లతా ముదిరాజ్ పేర్కొన్నారు.బీసీలు రాజ్యాధికారం కోసం దృఢమైన సంకల్పంతో క్షేత్రస్థాయి పోరాటాల నేపద్యం బీసి ల ఆకాంక్షలపై,అవకాశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం శుబపరినామమన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ గా ప్రగతి భవన్ పేరు మార్చడం తోపాటు దానిని మార్చి ప్రజా దర్బార్ గా ప్రకటిణచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి రాష్ట్ర మహిళా ఐక్యవేదిక తరఫున అభినందనలతోపాటు ధన్య వాదాలు తెలిపారు.మహాత్మా జ్యోతి రావు ఫూలే భారతీయ జాతి నిర్మాత. సామాజిక శాస్త్ర వేత్త. దేశంలో పేద బాల బాలికలందరికి విద్య అందాలని , పాఠశాలలు స్థాపించారు. వితంతువులు తాను పోవద్దని ఆశ్రయం కల్పించారన్నారు.కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసారు. మద్యపానం నిషేదం కోసం బ్రిటిష్ వారిని ఒప్పించారు. అంబేద్కర్ జ్యోతి రావు ఫూలే , సంఘం సంస్కర్త, విద్యావేత్త సామాజిక విప్లవ కారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టడం ద్వారా గొప్ప స్పూర్తి ని అందించారన్నారు.ప్రజలెన్నుకున్న ప్రతినిధి ప్రజలకు దొరకకుండా పెట్టిన కంచెలు. గేట్లను తొలగించి ప్రజలకు అందుబాటులో కి తెచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయం ప్రశంసనీయం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడానికి నిర్ణయించి అందరికీ తలపులు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ధన్య వాదాలు.

Leave A Reply

Your email address will not be published.