ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులలో ఏపీకి 450 కోట్ల కేటాయింపు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మిగ్‌జాం తుఫాన్ వ‌ల్ల త‌మిళ‌నాడు, ఏపీలో వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే. ఆ రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో న‌ష్టం జ‌రిగింది. పంట పొలాల్లోకి నీరు చేర‌డంతో న‌ష్టం భారీగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ నిధుల‌ను రెండు రాష్ట్రాల‌కు విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోంశాఖ‌ను ప్ర‌ధాని మోదీ ఆదేశించిన‌ట్లు ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో చెప్పారు. అయితే రెండు రాష్ట్రాల‌కే ఇప్ప‌టికే తొలి ఇన్‌స్టాల్మెంట్‌ను రిలీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌డిచిన 8 ఏండ్ల‌లో చెన్నైలో వ‌రద‌లు రావ‌డం ఇది మూడ‌వ‌సారి. అధిక వ‌ర్షాల వ‌ల్ల మెట్రో న‌గ‌రాల్లో ఆక‌స్మికంగా వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయ‌ని అమిత్ షా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.