ఆయుష్మాన్ కార్డ్ ద్వారా ఐదు లక్షల వరకు కేంద్రం సహాయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆయూష్మాన్ కార్డు ద్వారా అయిదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు. శనివారం నాడు వేపాడ మండలం వీలుపర్తిలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో మంత్రి అశ్వనీవైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వనీవైష్ణవ్ మాట్లాడుతూ… ‘‘ఒక్కప్పుడు కొళాయి ద్వారా నీరు కావాలంటే విశాఖపట్నం లాంటి నగరాలు వెళ్లేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ కొళాయిలను అందించే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్తవలస స్టేషను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా తీర్చు దిద్దుతాం. కేకే లైన్‌ని డౌబుల్ లైన్‌గా మార్చబోతున్నాం. దీంతో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాశీకి వెళ్లే రైలు ఎస్ కోట మీదుగా వెళ్లనుంది. విశాఖ బెనారస్ రైళ్లు ఫ్రీక్వెన్సీ పెంచనున్నాం’’ అని మంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.