కెసిఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తుంటి ఎముక విరిగిపోవడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు కొంత సమయం క్రితమే చేరుకొని పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.  జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి హాస్పిటల్ కు చేరుకున్న సీఎం, మంత్రులకు హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం 9వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కాసేపు మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తెలంగాణ ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన ఆకాంక్షించారు. CM RevanthReddy met KCR at Yashoda hospital మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హాస్పిటల్ లో కలిసి పరామర్శించిన… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. — ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. Chief Minister Revanth Reddy met former Chief Minister KCR in… pic.twitter.com/LcR3WOo9DV — Congress for Telangana (@Congress4TS) December 10, 2023 అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్, హరీశ్ రావు లతో కాసేపు మాట్లాడారు. తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎంను పరామర్శించానని తెలిపారు. త్వరగా కోలుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కేసీఆర్ ను కోరినట్టు చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని చెప్పారు.  కాగా..  అంతకు ముందే మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ కు చేరుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆయనను సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లలేకపోయారు. దీంతో అక్కడే ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.