ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నటుడు విజయ్ కాంత్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ పూర్తిగా కోలుకున్నారు. చెన్నైలోని పైవేటు ఆస్పత్రి నుంచి సోమవారం ఆయన డిశ్చార్జ్‌ అయినట్లు డీఎండీకే పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
దగ్గు, జలుబు సమస్యతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల తర్వాత మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన పూర్తిగా కోలుకోవడం వల్ల ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. డయాబెటిస్‌ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించారు. అనారోగ్య కారణాలతో విజరుకాంత్‌ కొంత కాలంగా సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గనడం లేదు. విజయకాంత్‌ భార్య ప్రేమలత కూడా వీడియో ద్వారా కెప్టెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రకటించారు. ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో మరో 14 రోజుల పాటు విజయకాంత్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. ఈరోజు విజయకాంత్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.