కేసీఆర్ పై శివమెత్తిన బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మర్రిగూడ మండల కేంద్రం రోడ్ షోకు హాజరైన వేలాది జనాన్ని ఉద్దేశించి బిజెపి ఎంపీ బండి సంజయ్ ఈ విదంగా మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ శివమెత్తారు. భిచ్చమెత్తుకునే స్థాయి నుండి వేల కోట్లు సంపాదించుకునే స్థాయికి ఏ విధంగా ఎదిగారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నిక తెలంగాణ పేదల తల రాతను మార్చే ఎన్నిక కాబోతోందని. నీతి, జాతి లేని టీఆర్ఎస్ రాక్షసులను తరిమి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ మనసున్న మంచి మనిషి అని పేర్కొన్న బండి సంజయ్. ఆయన రాజీనామాతో మునుగోడులో జరుగుతున్న అభివ్రుద్ధిని వివరాలతో సహా వెల్లడించారు. కమ్యూనిస్టులు సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు పూర్తిగా కేసీఆర్ కు అమ్ముడుపోయారని, ఆయన చెప్పిన అభ్యర్ధికే టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు. మునుగోడు ప్రజలుకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్ కు మర్రిగూడ మండల కేంద్ర ప్రజలు వేలాదిగా తరిలి వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ గీత రచయితలు దరువు ఎల్లన్న, నాగేశ్వరరావు మునుగోడు ఉప ఎన్నికలపై రచించిన పాటలను ఆవిష్కరించారు. పలువురు టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ స్వయంగా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జరిగిన సభకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి హాజరయ్యారు. సభకు హాజరైన వేలాది జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడిన అంశాలు. ఓటుకు రూ. 40 వేలు మీకు ఇఛ్చేందుకు టీఆర్ఎస్ నేతలు ప్యాకెట్లు రడీ చేస్తున్నరు. దుబ్బాకలో రూ.10 వేలు, హుజూరాబాద్ లో 20 వేలు ఇచ్చిర్రు. మునుగోడులో రూ.40వేలు ఇవ్వబోతున్నరు. పైసలు లెక్కపెట్టి మరీ తీసుకోండి.
• రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారని చాలా మంది అంటున్నరు… కేసీఆర్ సంపాదించిన సొమ్మునంతా కక్కించి ఇక్కడ పంచడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయించిండు..
• అయ్య ఫాంహౌజ్ స్టార్.. .కొడుకు డ్రగ్స్ స్టార్… అల్లుడు వెన్నుపోటు స్టార్… సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్.. మిగిలింది లిటిల్ స్టార్… మొత్తంగా వీళ్లంతా బంధిపోటు స్టార్స్…
• మీరంతా 5 ఏండ్లు రాజగోపాల్ రెడ్డికి ఓటేసి ఎమ్మెల్యేను చేసిర్రు. రాజగోపాల్ రెడ్డి కల్లాకపటం లేని మనిషి. ఎన్నికల తరువాత రాజకీయాలను పక్కనపెట్టి అభివ్రుద్ధి చేద్దామనుకున్నడు. కానీ సీఎం మునుగోడుకు పైసా ఇయ్యలే.
• కేసీఆర్… మా మునుగోడుకు పైసలెందుకియ్యవు? ఎందుకు అభివ్రుద్ధి చేయవని అడిగితే సీఎం అపాయిట్ మెంట్ ఇవ్వలే. డిగ్రీ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి ఏమైందని అడగడానికి అపాయిట్మెంట్ అడిగితే కేసీఆర్ ఇయ్యలే… మోదీ గారు రాష్ట్రానికి 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేశారు.. మునుగోడు ప్రజలకు ఇండ్లు ఇవ్వండి సార్ అని అడిగితే కేసీఆర్ టైం ఇయ్యలే.. మునుగోడు దళితులకు దళిత బంధు ఇయ్యమంటే ఇయ్యలే… గొల్ల కురమల గొర్లకు పైసలియ్యమని అడిగితే కేసీఆర్ టైమియ్యలే.. డ్రంకన్ డ్రైవ్ పేరుతో గౌడన్నల కల్లు వ్రుత్తిని దెబ్బతీస్తున్నారని అడిగితే టైమియ్యలే… పోడు భూముల సమస్యలెప్పుడు పరిష్కరిస్తవని అడిగితే టైమియ్యలే…
• రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసినా? అసెంబ్లీలో నిలదీసినా? హెచ్చరించినా కేసీఆర్ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలే.. అప్పుడు రాజగోపాల్ రెడ్డికి బీజేపీకి గుర్తుకొచ్చింది.
• ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున నిలబడ్డ వెంటనే… చౌటుప్పల్ నుండి నారాయణపూర్ కు రోడ్డు వచ్చింది. గట్టుప్పల్ కొత్త మండలం వచ్చింది. జిల్లాకు బస్తీ దవాఖానా రాబోతోంది. పెన్షన్ పైసలు వస్తున్నయ్. గొల్ల కురుమల అకౌంట్లో 1.53 లక్షల అకౌంట్లో జమ చేసిండ్రు. చేనేత బంధు అమలవుతోంది. తండాల అభివ్రుద్ధి అంటున్నడు… ఏడాది టైమున్నా రాజీనామా చేసినందున ఈ మాత్రం అభివ్రుద్ధి జరుగుతోంది.
• రాజగోపాల్ రెడ్డి మనసున్న మనిషి. పేద వాడు వెళితే బాధ చెప్పుకుంటే సాయం చేసే గుణం ఆయనది.
• అలాంటి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 16 మంది మంత్రులు, 87 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలంతా ఇక్కడే మకాం వేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి పుణ్యమా? అని వాళ్లంతా మీ కాళ్ల దగ్గరకు వచ్చిండ్రు.. మీ పిల్లలకు స్నానాలు చేస్తున్నరు. మీ ముడ్డి కడుగుతున్నరు…
• అంతకుముందు ఏనాడైనా ఇంత మంది మీ ఊరికి వచ్చిండ్రా? మీ బాధ విన్నరా? ఏనాడైనా నీళ్లు లేవంటే పట్టించుకున్నారా?
• కుర్చీ వేసుకుని కూర్చుని చర్లగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తానని, 1.75 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానన్నవ్… ఏమైంది?
• ఫ్లోరైడ్ సమస్య నావల్లే పరిష్కారమైందని చెప్పిన కేసీఆర్ కు సిగ్గులేదు… ఏయ్ కేసీఆర్… ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని 2003లోనే వాజ్ పేయి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ నిధులిస్తోంది బీజేపీ ప్రభుత్వమే.
• మర్రిగూడ నుండి సవాల్ చేస్తున్నా…. 8 ఏండ్లలో ఎన్ని నిధులిచ్చావు? ఎన్ని ఇండ్లు మంజూరు చేసినవ్? ఎంతమందికి ఉద్యోగాలిచ్చినవ్? ఎంతమందికి దళిత బంధు ఇచ్చినవ్? ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవ్? ఎంతమందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చినవో చెప్పాలి..
• మీకోసం పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలను కొడుతున్నరు. కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నరు. దేనికోసం వచ్చిందన్నా తెలంగాణ? కేసీఆర్ ఏం పీకారన్నా? తెలంగాణ కోసం ఉద్యమించి దెబ్బలు తిన్నది నా మర్రిగూడెం ప్రజలు… కేసీఆర్ బిడ్డ, కొడుకు, అల్లుడు తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలే…
• కేసీఆర్ పాలనలో ఉద్యోగం రాని, ఉపాధి దొరకని యువకులంతా బీజేపీకి ఓటేయాలి. దళిత బంధు రాని వారు, నిరుద్యోగ భ్రుతి అందని వారు, చేనేత బంధు అందని వారు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందని వారంతా బీజేపీకే ఓటేయాలని కోరుతున్నా…
• మునుగోడు ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలు కావు.. తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నిక. రాష్ట్రంలోని పేదోళ్లంతా మునుగోడు ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నరు. కేసీఆర్ గెలిస్తే మా బతుకులు ఆగమైతయ్… జీవితాలను నాశనం చేస్తరు. పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రాధేయ పడుతున్నరు. ఒక్కసారి ఆలోచించండి…
• ఇక్కడ గుంట నక్కల పార్టీలన్నీ ఏకమైనయ్.. రాజగోపాల్ రెడ్డి సింహం లెక్క సింగిల్ గా వస్తుండు… కమ్యేనిస్టులు అమ్ముడు పోయిండ్రు… కమ్యూనిస్టుల అడ్డా నల్లగొండ గడ్డ అని చెప్పుకునే కమ్యూనిస్టు ఒక లీడర్ ఖమ్మం జిల్లాలో సొంత పగ కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టిండు. కమ్యూనిస్టు కార్యకర్తలారా సిద్దాంతాం కోసం పనిచేస్తున్న మీకు హ్యాట్యాప్?.. ఒక్కసారి మీ లీడర్ తీరును గమనించండి.
• కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది. కేసీఆర్ చెప్పిన వ్యక్తికే టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ లో గెలిచిన నేతలంతా టీఆర్ఎస్ లోకి పోయేటోళ్లే…
• కేసీఆర్ … నీకు దమ్ముంటే టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల తో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రా….
• మిమ్ముల్ని టీఆర్ఎస్ నేతలు కులాలు, మతాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రయత్నం చేయబోతున్నరు. మీరంతా ఒక్కటి కావాలి. ఈ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ బాక్సులను బద్దలు కొట్టాలే..
• కేసీఆర్ ది ఒకప్పుడు బిచ్చపు బతుకు. ఒకనాడు పైసలు కట్టకుంటే కారును గుంజుకుపోయిండ్రు. ఫైనాన్స్ కట్టలేదని ప్రచార రథాన్ని కూడా గుంజుకుపోయిండు. ఆనాడు తిండికి లేని కేసీఆర్ ఇయాళ రూ.100 కోట్లతో విమానాన్ని ఎట్లా కొన్నారో ప్రజలకు చెప్పాలే… ఫాంహౌజ్ ఎట్లా కొన్నారో, వేల కోట్లు ఎట్లా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలే..
• నీతి, జాతి లేని రాక్షసులను తెలంగాణ నుండి తరిమి తరిమి కొట్టే అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరుతున్నా… ఈ ఎన్నికలు మీకు మాత్రమే పరిమితం కాదు… తెలంగాణలోని పేదల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నవి.. వాళ్ల పక్షాన రెండు చేతులెత్తి జోడిస్తున్నా… పువ్వు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ను పాతరేయండి.
• అంతకుముందు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పేరు వింటేనే టీఆర్ఎస్ గజగజ వణుకుతోంది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ దెబ్బకు టీఆర్ఎస్ భయపడి ఇక్కడే మకాం వేసింది. మీకో అవకాశం వచ్చింది. రాజకీయ చైతన్యం ఉన్న మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి. మొన్న దుబ్బాక, నిన్న హుజూరాబాద్, రేపు మునుగోడు బీజేపీదే కాబోతోంది అని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.