ప్రాచీన పద్ధతిలో సేంద్రియ వ్యవసాయానికి కృషి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రాచీన పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయానికి రైతు సంక్షేమ సేవా సంఘం కృషి చేస్తుందని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ఓ ఆధారిత వ్యవసాయం రైతులతో చేయించి ఆరోగ్యకరమైన పంటలు పండించి ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మించాలని అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పంటకు పాడే అవసరం అని,గతంలో కూడా పాడే పంట అనేవారని, ఈమధ్య పశువులు అంతరించి ఫాడి లేకుండా రసాయనక ఎరువులతో వ్యవసాయం చేస్తున్నారు ఆ పంటలు తిన్న ప్రతివారు అనారోగ్య పాలవుతున్నారని ప్రేమ్ సాగర్ యాదవ్ పేర్కొన్నారు. కావున ఇప్పుడైనా అందరూ మేల్కొని సేంద్రియ వ్యవసాయానికి దృష్టి పెట్టి ఇటు రైతులను కాపాడుతూ ఆవులను భూమిని సారవంతం చేస్తూ ఆ భూమిలో వంటిన పంటల ద్వారా అందరూ ఆరోగ్యవంతులు కావాలనేదే రైతు సంక్షేమ సేవా సంఘం సంకల్పమన్నారు. ప్రతి ఒక్కరు కుడా రైతు సంక్షేమ సంఘానికి సహకరిస్తూ సలలు సూచనలు చేయాలని ఆయన కోరారు. తమతమ సూచనలు సలహాలు +91 92914 63969 మొబైల్ లు తెలియజీయాలని ప్రేమ్ సాగర్ యాదవ్ విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.