బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో మహిళలకు శనివారం తెలంగాణ ప్రభ్యుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రజిత, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ చందర్ రావు, గాజుల సతయ్య, పార్టీ అధ్యక్షులు గాండ్ల రమేష్, వార్డు సభ్యులు దుర్గం రవీందర్, కట్ట లచ్చయ్య, పార్టీ నాయకులు కమలాకర్, రామన్న, కార్యదర్శి చందన, మహిళా సంఘాల సీఏలు పాల్గొన్నారు.