తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు, చేతివృత్తులకు పూర్వ వైభవం

.. సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఆబ్కారీక్రీడాపర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య గౌడ సంఘాల నాయకులుప్రతినిధులు ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. విశ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కులవృత్తులకుచేతివృత్తులకు పూర్వ వైభవాన్ని తెచ్చారన్నారు. గతంలో హైదరాబాద్రంగారెడ్డి జిల్లాలో కల్లు ను నిషేదించి గీత వృత్తిని కనుమరుగు చేయాలని కుట్రలు చేశారన్నారు. సీఎం కేసిఆర్ అదేశాల మేరకు హైదరాబాద్రంగారెడ్డి జిల్లాల్లో మూతపడ్డ కల్లు దుకాణాలను తెరిపించి గౌడ్ల ఆత్మ గౌరవాన్ని నింపారన్నారు. గౌడ్లు ఆర్థికంగా ,సామాజికంగారాజకీయంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి పతకాలను అందించారన్న్నారు. తాటిఈత చెట్ల పన్నును రద్దు చేశారు. సొసైటీల బకాయిలను రద్దు చేశారన్నారు.  గీత వృత్తిని ప్రోత్సహించేందుకు హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి ,ఈత చెట్లను గిరిక చెట్లను నాటి ప్రోత్సహిస్తున్నారు. గతంలో గీత కార్మికులు తాటిచెట్టు పై నుండి పడి మరణించినఅంగ వైకల్యానికి గురైన గీత కార్మికులకు 50 వేల రూపాయలు ఇచ్చేవారు అన్నారు.  నేడు సీఎం కేసీఆర్ గారు గీత కార్మికులు తాటి ,ఈత చెట్ల పై నుండి ప్రమాదవశాత్తు పడి  మరణించినశాశ్వతంగా అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు 5 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ను అందించి గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైన్ షాపులలో 15% రిజర్వేషన్లు కల్పించి గౌడ్లు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. గతంలో గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారులు ఎన్నో దాడులు చేసి కేసులు నమోదు  చేసేవారు. కానీనేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల ను ఎక్సైజ్ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆదేశించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసిని ప్రవేశపెట్టి నీరా ను  గౌడ్  లు  మాత్రమే ఉత్పత్తి చేసి అమ్మకాలు జరిపేలా ప్రత్యేక జీవోను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు  దక్కుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 20 కోట్ల రూపాయల తో హైదరాబాద్ లో ని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించమన్నారు. ఇదే నియోజకవర్గ పరిధిలో సర్వేల్ లో నీరా ఉత్పత్తి కేంద్రం ను  ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గౌడ్ల ఆత్మ గౌరవం కోసం సుమారు 500 కోట్ల విలువైన భూమిని కోకాపేటలో కేటాయించారన్నారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులను అందిస్తున్నామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్ష లో పాపన్న చరిత్ర పై ప్రశ్న రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. పాపన్న నిర్మించిన కోటలను పర్యాటకం గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే పెన్షన్లుకల్యాణ లక్ష్మీషాది ముబారక్రైతు బంధురైతు బీమానిరంతర విద్యుత్ ఉచిత సరఫరా లాంటి పథకాల తో పాటు సాగునీరుపరిశుద్ధ మైన మంచి నీరు అందిస్తున్నామన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని మంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకగుజరాత్ గోవా లాంటి రాష్ట్రాల్లో కల్లు అమ్మకాలను నిషేధం విధించారన్నారు. రాష్ట్రంలో గౌడ్ ల సంక్షేమానికిఅభివృద్ధి కి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి గౌడ సంఘాలువృత్తిదారులుకార్మికులు మద్దతు గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్పల్లె రవి కుమార్ గౌడ్జై గౌడ్ జాతీయ అధ్యక్షుడు డా. వట్టికూటి రామారావు గౌడ్అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ళ వేములయ్య గౌడ్అంబాల నారాయణ గౌడ్సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్యాదగిరి గౌడ్కాశయ్య గౌడ్నర్సింహ గౌడ్టిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్నీరా సత్యం గౌడ్మమత గౌడ్బత్తిని లత గౌడ్విజయ గౌడ్కేఎల్ఎన్ ప్రసాద్ గౌడ్ముద్దగోని నగేష్ గౌడ్బింగి భారత్ గౌడ్నారాయణ పురం జడ్పీటీసీ వెంకటేష్ గౌడ్చౌటుప్పల్ మున్సిపల్ 2వార్డ్ కౌన్సిలర్ స్వామి గౌడ్తాళ్ళ సింగారం అధ్యక్షుడు నగేష్ గౌడ్లింగోజీ గూడం అధ్యక్షుడు సతీష్ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.