ఇక సరికొత్త ఆరోగ్యశ్రీ అమలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆరోగ్యశ్రీ … నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన సరికొత్త కార్యక్రమం. కేవలం ప్రభుత్వ దవాఖానాల్లోనే కాదు కార్పోరేట్ హాస్పిటల్స్ లో కూడా ఉచితంగానే వైద్యాన్ని పొందేలా ఆరోగ్యశ్రీని రూపొందించారు. కేవలం ఆరోగ్య శ్రీ కార్డు వుంటే చాలు… ప్రజల ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొంది ప్రాణాలు దక్కించుకున్నవారు వైఎస్సార్ ను దేవుడిలా కొలుస్తారు. ఇలా తన తండ్రి ఖ్యాతిని మరింత పెంచిన ఆరోగ్యశ్రీని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత సమర్ధవంతంగా అమలుచేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన వైసిపి సర్కార్ సరికొత్త ఫీచర్లతో కూడిన కార్డులను లబ్దిదారులకు అందించేందుకు సిద్దమయ్యింది.  ఇవాళ్టి నుండి ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయపరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతేకాదు కొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, యాప్ ను ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.   ఆరోగ్యశ్రీ కార్డులో కొత్త ఫీచర్లు :  కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం పొందడమే కాదు మరికొన్ని సదుపాయాలను పొందవచ్చని అధికారలు చెబుతున్నారు. అలాగే ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరి ఫోన్ లో అయినా ఆరోగ్య శ్రీ యాప్ వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై కేవలం హెల్త్ వర్కర్స్ తో మాత్రమే అవగాహన కల్పించడం మాత్రమే కాదు వాలంటీర్లు, పోలీసులు చివరకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసేలా  కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా రూపొందించిన హెల్త్ కార్డ్ లో లబ్దిదారుని పేరు. ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబసభ్యులు వివరాలు వుండనున్నాయి. అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద సేకరించిన లబ్దిదారుడి ఆరోగ్య వివరాలకు సంబంధించిన ఐడీ కూడా వుంటుంది. అలాగే ప్రతి కార్డుపై ఓ క్యూఆర్ కోడ్ వుంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సదరు కార్డు హోల్డర్ ఆరోగ్య వివరాలన్ని వస్తాయట. కార్డు హెల్డర్ చేయించుకునే వైద్య పరీక్షలు, ఏయే వ్యాధులు కలిగివున్నారు, ఏ చికిత్స పొందారు, డాక్టర్ సిపార్సులు…  ఇలా సమస్త సమాచారం క్యూఆర్ కోడ్ తో లాగిన అవడం ద్వారా వస్తుందట. తద్వారా రోగి ఆరోగ్యపరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన వస్తుందని… తద్వారా మెరుగైన వైద్యం అందించే అవకాశం వుంటుందని అధికారులు చెబుతున్నారు.  విలేజ్ క్లినిక్ ల ఏర్పాటు : వైద్యం కోసం హాస్పిటల్స్, డాక్టర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా గ్రామాలకు వైద్యసేవలు చేరువ చేసేందుకు వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోంది.  ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ప్రతి మండలంలో పిహెచ్ గత ప్రభుత్వంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా… దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్, ప్రతి మండలానికి కనీసం రెండు పీ.హెచ్‌.సీలు వుండేలా చూస్తోంది. కేవలం పిహెచ్సి ల ఏర్పాటుతో సరిపెట్టకుండా   ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు వైసిపి ప్రభుత్వం సిద్దమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.