‘రక్తదానం మహాదానం..ప్రాణదానం’

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని Q-సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖ మరియు మ్యాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంలో గచ్చిబౌలిలోని ‘క్యూ – సిటీ’ లో రెడ్ క్రాస్, విద్యానగర్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్ గారు మాట్లాడుతూ ‘రక్తదానం మహాదానం మరియు ప్రాణదానం’ అని కంపెనీలోని ఉద్యోగులు మానవతా దృక్పథంతో మరియు ఒకరి ప్రాణం కాపాడాలని తన వంతు సాయంగా 104 మంది రక్తదానం చేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని   ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మ్యాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య సిబ్బంది ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మ్యాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య సిబ్బంది మాలతి, అశ్విని, రజిత మరియు యూత్ ఫోర్స్ సిబ్బంది వినీల్ , మల్లేష్, శృతి, కమల్, సత్య, మహేష్, దుర్గేశ్వరి మరియు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏవి రావు, రెడ్ క్రాస్ వాలంటీర్లు సతీష్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.