ఇంటింటికి గడపగడపకి అయోధ్య రాముని అక్షింతలు  

విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పోత్నాక్ రఘువేందర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అయోధ్య రామభవ్యమందిర ప్రారంభమహోత్సవం పురస్కరించుకొని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో  ఇంటింటికి,గడపగడపకి అయోధ్య రాముని అక్షింతలు అందజేయ్యాలని సంకల్పించినట్లు  విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పోత్నాక్ రఘువేందర్ తెలిపారు. భువనగిరి పట్టణం  లోశ్రీరామ భక్త భజన మండలి లో వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను శ్రీరామ భక్త భజన మండలి వద్ద వారికి అందజేశారు .సమావేశంలో విశ్వహిందూ పరిషత్ అన్ని మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమంలో   ప్రతి గడపకి అక్షంతలను జన్మభూమి దేవాలయ ఫోటోను నివేదన పత్రాన్ని అందించాల్సిన బాధ్యత కార్యకర్తలు విజయవంతంగా పూర్తి చేయాలని, జనవరి 22 విగ్రహప్రతిష్ట సందర్భంగా ఇంటింటా దీపావళి జరుపుకోవాలని ప్రతి దేవాలయంలో  ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు.జిల్లా నుంచి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అతిథిగా తెలంగాణ నుంచి 46 మంది స్వామీజీలకు ఆహ్వానం అందిందని బొమ్మలరామారం మండలం పర్వతాపూర్ సాయి ధామం పీఠాధిపతి శ్రీ శ్రీ రామానంద స్వామి గారికి ఆహ్వానం అందడం సంతోషకరమని పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు  ఇట్టి కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్  రాష్ట్ర సహకార్యదర్శి  తోట భాను ప్రసాద్ జిల్లా అధ్యక్షులు  జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్

కోశాధికారి చామ రవీందర్ పట్టణ అధ్యక్షులు కేమోజి మల్లికార్జున చారి పట్టణ కన్వీనర్ పొన్నాల వినయ్  బిజెపి నాయకులు కొల్లోజు సతీష్ కుమార్ హిందూ పరివార్  ముఖ్య నాయకులు వివిధ మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.