గత ఏడాదితో పోలిస్తే మహానగరం లో 2 శాతం పెరిగిన నేరాలు

స్థిరాస్తి కేసులు 3 శాతం..దోపిడీలు 9 శాతం పెరిగాయి మహిళలపై12 శాతం పెరిగిన నేరాలు రేప్‌ కేసులు 2022లో 343 ఉంటే..ఈ ఏడాది 403 నమోదు నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాయి డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోతే రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష హైదరాబాద్‌ నగర వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ కొత్తకోట

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులుబార్లలో డ్రగ్స్‌ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోతే రూ.10 వేల జరిమానాఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కొటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. . సరఫరా చేసేవాళ్లు ఎక్కడ ఉన్నా వెతికిమరి పట్టికుంటామన్నారు. డ్రగ్స్‌ గుర్తించేందుకు స్నిఫర్‌ డాగ్స్‌ను వాడతామని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2 శాతం పెరిగాయని వెల్లడించారు. స్థిరాస్తి కేసులు 3 శాతం పెరిగాయన్నారు. దోపిడీలు 9 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మహిళలపై కూడా నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయన్నారు. రేప్‌ కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై నేరాలు 12 శాతం తగ్గాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందన్నారు. ఇక సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయని తెలిపారు. సైబర్‌ నేరాల కారణంగా గత ఏడాది రూ.82 కోట్ల మోసాలు జరిగితే.. ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేశామని చెప్పారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్‌ కేసులు, 242 కిడ్నాప్‌ కేసులు, 4909 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.