‘గంజా శంకర్’ సినిమా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ డిమాండ్:

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: టీవల విడుదలైన సాయి ధర్మ తేజ హీరోగా, సందీప్ నంది దర్శకత్వంలో విడుదలైన’ గంజా శంకర్’ టీజర్ డ్రగ్స్ యువత ను ప్రేరేపించే విధంగా వుందని తక్షణమే ఈ సినిమా డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేశ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా చైర్మన్ విధుర్ చావల డిమాండ్ చేస్తూ స్టేట్ హోం మరియు సినిమాటోగ్రఫీ సెక్రటరీ జితేంద్ర, ఐపిఎస్ కి వినతి పత్రాన్ని అందించారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు యుక్తవయసులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న కిల్లి దుకాణాలు, కాపీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటుందని మాదక ద్రవ్యాల సరఫరా అనేది రాష్ట్రంలో చాప కింద నీళ్ల లాగా వ్యాపిస్తుందని తెలుస్తుంది. యువకులను హై క్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి వారిని క్రమంగా డార్క్ వెబ్ కు కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికి సరఫరా చేసే వరకు వ్యవస్థ దిగజారిపోయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు వాడకం అనేది లేకుండా మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన్ని చెప్పడంతో జవహర్ బాల్ మంచ్ విభాగం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 17 సంవత్సరాల వయస్సు లోపు వారు మాదకద్రవ్యాల వాడకానికి బానిసలుగా ఉన్నారంటే గంజా శంకర్ లాంటి సినిమాలు ప్రభావమే ఉంటుందని తెలుస్తుంది కాబట్టి దయచేసి ఈ గంజా శంకర్ సినిమా విడుదలను సెంట్రల్ ఫిల్మ్ బోర్డు సర్టిఫికేషన్ వారు తగిన చర్యలు తీసుకొని ఈ సినిమా విడుదల ను నిలిపివేయాలని ‘జవహర్ బాల్ మంచ్’ యువకుల పక్షాన డిమాండ్ చేస్తుంది

Leave A Reply

Your email address will not be published.