మానవ జీవనానికి దిక్సూచి భగవద్గీత

పిఎస్విజి ఆద్వర్యం లో ఘనంగా శ్రీమత్ భగవద్గీత జయంతి ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శ్రీ పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీమత్ భగవద్గీత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు  భగవద్గీత పారాయణ ను చేసి అలరించారు. చౌటుప్పల్ లోని  తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ మణిమాల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సామాజిక సాహిత్య ఆధ్యాత్మికవేత్త బడుగు శ్రీరాములు విచ్చేసి ప్రసంగించారు. మానవ జీవనానికి భగవద్గీత దిక్సూచి లాంటిదని, మానవ పరిపూర్ణ వికాసానికి భగవద్గీత ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పిఎస్విజి చైర్మన్ సామాజిక కార్యకర్త సౌజన్యమూర్తి పాలకుర్లా మురళి గౌడ్ సాగుతో ఉపన్యాసం చేస్తూ దేశ విదేశాలలో ఉన్న అనేక మందిని ప్రభుత్వం చేసిన గంధం భవద్గీత అన్నారు. ప్రిన్సిపాల్ మణిమాల మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం  కలిగించడానికి ఉత్తమ గ్రంథం భగవద్గీత అన్నారు. శాస్త్రవేత్తలకు ఈ గ్రంధం  మార్గదర్శకం చేసిందన్నారు. అనంతరం విద్యార్థుల స్పందన వినిపించారు. భాషాపరంగా సౌశీర్య పరంగా ఈ గ్రంథం దోహదపడుతుందని విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గీత ఇతర భోజన సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.