రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం

జనవరి 6వ తేదీనుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఓటు హక్కు లేని, ఓటర్‌ కార్డులో తప్పులు, అడ్రస్‌ మార్చుకోవాలను కునే ఓటర్ల కోసం ఇలాంటి వాళ్ల కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. జనవరి 6వ తేదీనుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది.ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ సందర్భంగా స్వీకరించనున్నారు. 2024 జనవరి ఒకటవ తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్‌లో అప్‌డేట్‌ చేసినతరువాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.వచ్చే ఏడాది అక్టోబర్‌లోగా 18సంవత్సరాలు నిండుతున్నవారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే, వీరి దరఖాస్తుల పరిశీలన మాత్రం అక్టోబర్‌ 1 తరువాత నిర్వహించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా చేపడతారు. ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1లోగా 18సంవత్సరాలు పూర్తవుతున్నవారు కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మరోవైపు, ఈ నెల 20వ తేదీనుంచి వచ్చే ఏడాది జనవరి ఐదవ తేదీ పోలింగ్‌ స్టేషన్ల రీ-ఎరేంజ్‌మెంట్‌, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, ఓటర్ల జాబితాలోని ఫోటోల్లోని లోపాల సవరణ, పోలింగ్‌ కేంద్రాల సరిహద్దుల సవరణ తదితర ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.