మరొక డోసు కోవిడ్ వ్యాక్సిన్ తప్పదా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 విస్తరణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కూడా కరోనా కొత్త కేసుల పెరుగుదలకు ఈ జేఎన్ 1 వేరియంట్ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జేఎన్ 1 వేరియంట్‌ నుంచి రక్షణ పొందేందుకు మరో డోసు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని సార్స్‌కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా స్పందించారు. జేఎన్ 1 కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు.దేశంలో వెలుగు చూసిన కొవిడ్‌ కొత్త ఉపరకం జేఎన్‌ 1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని డాక్టర్‌ ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే గతంలో వెలుగు చూసిన ఉపరకానికి, జేఎన్ 1 వేరియంట్‌కు మధ్య వ్యాధి లక్షణాల్లో పెద్దగా తేడా లేదని చెప్పారు. 60 ఏళ్లు, ఆపై వయసు వారితోపాటు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు.. జేఎన్ 1 వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.ఇప్పటివరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వారు ఇకపై అయినా తీసుకోవడం మంచిదని తెలిపారు. జేఎన్ 1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని డాక్టర్ ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ప్రతీ వారం దేశంలో కొత్త కరోనా వేరియంట్ వస్తుందనే వార్తలు ఉన్నాయని.. ఇప్పటి వరకు దేశంలో సుమారు 400 కు పైగా సబ్ వేరియంట్‌లను గుర్తించామని తెలిపారు. ఈ సబ్ వేరియంట్‌లు మార్పు చెందుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్ వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఈ జేఎన్ 1 రకం వేరియంట్‌లో ఉంటాయని వెల్లడించారు. 2 నుంచి 5 రోజుల్లో దీని నుంచి కోలుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ జేఎన్ 1 కొత్త వేరియంట్‌కు సంబంధించి 22 కేసులు వెలుగు చూడటంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్ కారణంగా ఎక్కువగా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని.. కాబట్టి దీని గురించి ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే జేఎన్ 1 వేరియంట్‌ను అడ్డుకోవచ్చని అరోరా తెలిపారు.జేఎన్‌ 1 సబ్ వేరియంట్‌పై సీనియర్‌ పల్మనాలజిస్ట్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ జేఎన్ 1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. మానవుల శరీరంపై భారీగా ప్రభావాన్ని చూపడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. చేతులు అడ్డుగా పెట్టుకుని దగ్గడం, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని రణదీప్ గులేరియా తెలిపారు

Leave A Reply

Your email address will not be published.