అయోధ్య రాముడికి అత్తవారింటి నుండి పట్టు వస్త్రాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కొత్త సంవత్సరం జనవరి 22న జరిగే అయోద్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాముడికి అత్తవారిళ్లైన నేపాల్ లోని జనకపురి నుంచి పట్టువస్త్రాలు, ఆభరణాలు, కానుకలు రానున్నాయి. నేపాల్ ప్రత్యేకంగా ఆ పవిత్ర మహోత్సవానికి పట్టువస్త్రాలు, ఆభరణాలు, స్వీట్లతో కూడిన ప్రత్యేక సావనీర్‌లను పంపనున్నట్లు ఆదివారం తెలిపింది.  దీనికోసం జనక్‌పూర్ ధామ్-అయోధ్యధామ్ యాత్రను మొదలుపెట్టబోతున్నట్లుగా పత్రికా కథనాలు వెల్లడిస్తున్నాయి. జనవరి 18న ప్రారంభం కానున్న ఈ యాత్ర జనవరి 20న అయోధ్యలో ముగుస్తుందని, అదే రోజు సావనీర్‌లను శ్రీరామజన్మభూమి రామమందిరం ట్రస్టుకు అందజేస్తామని జానకి ఆలయ ఉమ్మడి మహంత రాంరోషన్ దాస్ వైష్ణవ్ తెలిపారు. అయోధ్యకు తమిళనాడులో తయారైన 48 గుడిగంటలు.. ఒక్కోదాని బరువెంతో తెలుసా? జనవరి 22న శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. జనక్‌పూర్ధామ్ నుంచి సాగే ఈ ప్రయాణం జలేశ్వర్ నాథ్, మలంగ్వా, సిమ్రౌంగధ్, గాధిమాయి, బిర్‌గంజ్ మీదుగా బేటియా, కుషీనగర్, సిద్ధార్థనగర్, గోరఖ్‌పూర్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకుంటుంది. అంతకుముందు, నేపాల్‌లోని కాళిగండకి నదీతీరం నుండి సేకరించిన శాలిగ్రామ్ రాళ్లను అయోధ్యకు రాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి పంపారని, దీనిని ప్రారంభోత్సవం రోజున ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.